ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- April 24, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన దూకుడును ప్రదర్శించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చల దశలో ఉన్నప్పటికీ, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నౌకలకు విఘాతం కలిగిస్తూ, సముద్రంలో మందుపాతరలు (మైన్లు) వేస్తున్న ఏ ఇరాన్ నౌకనైనా తక్షణమే కాల్చివేయాలని యూఎస్ నేవీని ఆదేశించారు.
ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ విషయంలో ఎటువంటి సంకోచం అవసరం లేదని, అమెరికా రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.”హర్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతూ మా నౌకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ కు చెందిన ఏ చిన్న పడవనైనా కాల్చి ధ్వంసం చేయాలని నావికాదళాన్ని ఆదేశించాను.”ట్రంప్ పేర్కొన్నారు.
అంతేకాదు ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతోందని సెటైర్లు వేశారు. హర్మూజ్‌పై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని పేర్కొన్నారు. అమెరికా నేవీ పర్మిషన్ లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ.. బయటకు వెళ్లడం లాంటిది ఉండదని తెలిపారు. తమతో ఇరాన్ ఒప్పందానికి వచ్చేవరకు ఇది మూసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







