సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- April 24, 2026
ముంబై: ముంబైలోని తన నివాసం వెలుపల అభిమానుల సమక్షంలో సచిన్ టెండూల్కర్ తన 53వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. గిరిజన ప్రాంత పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్, తన కోసం వేచి ఉన్న అభిమానుల కోరిక మేరకు కేక్ కట్ చేసారు..
సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆయన నివాసం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు.అభిమానులు తీసుకొచ్చిన ప్రత్యేక కేక్‌ను సచిన్ వారి మధ్యలో కట్ చేశారు. “హ్యాపీ బర్త్‌డే సచిన్” అంటూ ఫ్యాన్స్ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది.తన ఇంటి వద్ద వేచి ఉన్న అభిమానులను చూసి సచిన్ బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు.
రెండు రోజుల క్రితమే ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో గిరిజన పిల్లలతో కలిసి సమయం గడిపిన సచిన్, తిరిగి ముంబై చేరుకుని తన నివాసం వద్ద ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అటు సేవా కార్యక్రమాలు, ఇటు అభిమానులతో పలకరింపులతో సచిన్ 53వ పుట్టినరోజు అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి







