IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- April 24, 2026
గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అదరగొట్టిది. గుజరాత్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ సెంచరీ వృధా అయిపోయింది. 206 పరుగుల టార్గెట్ ను బెంగళూరు చేజ్ చేసింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో గుజరాత్ ను చిత్తు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. కోహ్లి 44 బంతుల్లో 81 పరుగులు.. పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు బాదారు. ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది 5వ విజయం. ఈ గెలుపుతో పాయింట్ల టేబుల్ లో 2వ స్తానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది బ్యాక్ టు బ్యాక్ ఓటమి. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఊపు మీద కనిపించిన గుజరాత్.. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









