ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- April 25, 2026
న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, మే 9న ఆయన తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా మోదీ తెలంగాణాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ పర్యటనలో భాగంగా మోదీ MMTS ఫేజ్ 2 జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు బీబీ నగర్ AIIMS హాస్పిటల్ జాతికి అంకితం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటితోపాటు తెలంగాణలో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన చేస్తారని.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతో పాటు.. పలు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారని సమాచారం. అనంతరం జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇదిలా ఉంటే.. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని యూనివర్సిటీకి వెళ్తారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
తాజా వార్తలు
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







