సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- April 26, 2026
యూఏఈః ప్రజలను మోసం చేయడానికి, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫేక్ సోషల్ మీడియా అంకౌట్లు, మెసేజులు పెరిగిపోతున్నాయని అబుదాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు.ఇవి కాన్సర్ట్, ఫేక్ వీసాలు, నియామక ఆఫర్లు, ఆకర్షణీయమైన ఇన్సూరెన్స్ పేరుతో మోసాలకు పాల్పడతాయని పోలీసులు వెల్లడించారు. అలాగే, తక్కువ ధరకే వెహికిల్స్ సేల్స్ అంటూ తప్పుదోవపట్టిస్తాయని పేర్కొన్నారు. ఇలా రకరకాల ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట మోసగాళ్లు బాధితులను బురిడీ కొట్టాస్తారని అధికారులు తెలిపారు.
ఇలాంటి ఫేక్ అకౌంట్లు నిజమైనవిగా కనిపించడానికి.. ఫేక్ ఫోటోలు, నమ్మించేలా మెసేజులు, ఆథరాయిజ్డ్ సర్టిఫికేట్ల వంటి అధునాతన ఎత్తుగడలను ఉపయోగిస్తాయని అబుదాబి పోలీసులు పేర్కొన్నారు. ఏదైనా ఆఫర్ ప్రకటన సోర్స్ ను ధృవీకరించుకోవాలని, విశ్వసనీయమైన, అధికారిక వేదికలపైన మాత్రమే లావాదేవీలు జరపాలని అధికారులు నివాసితులను కోరారు. సరైన ధృవీకరణ లేకుండా మనీ ట్రాన్స్ పర్ చేయడం లేదా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవడం చేయరాదని అధికారులు హెచ్చరించారు.
ఏవైనా అనుమానాస్పద అకౌంట్లు లేదా ప్రకటనల గురించి అమాన్ సర్వీస్ ద్వారా 8002626 నంబర్‌కు కాల్ చేయడం, 2828 నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపడం, [email protected] కు ఇమెయిల్ చేయడం లేదా “పోలీస్ స్టేషన్ ఇన్ యువర్ పాకెట్” సేవను ఉపయోగించడం ద్వారా నివేదించాలని ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







