ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- April 26, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ, రాజకీయ క్షేత్రంలో వేడి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా దళపతి విజయ్ స్థా తమిళ వెట్రి కజగం సోషల్ మీడియా విభాగం , ఆయన అభిమానులు చేస్తున్న హడావుడి చాలా ఎక్కువగా ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన రద్దీని, యువత ఉత్సాహాన్ని చూపిస్తూ.. తమిళనాట విజయ్ ప్రభంజనం ఖాయమని, ద్రావిడ పార్టీల కోటలు బద్దలవ్వడం ఖాయమని వారు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే, గ్రౌండ్ రియాలిటీని విశ్లేషిస్తున్న వారు మాత్రం.. టీవీకే 20 సీట్లు సాధిస్తే అయన సంచలన ఫలితాలు సాధించినట్లేనని విశ్లేషిస్తున్నారు.
ద్వంద్వ పోరాటంలో మూడో శక్తి
తమిళ మీడియా చేస్తున్న క్షేత్రస్థాయి విశ్లేషణల ప్రకారం.. ప్రధాన పోటీ డీఎంకే , ఏఐఏడీఎంకే ( కూటముల మధ్యే కేంద్రీకృతమై ఉంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకును అంత సులభంగా ఛేదించడం విజయ్‌కు సాధ్యం కాదని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అయినప్పటికీ, విజయ్ పార్టీ గణనీయమైన స్థాయిలో ఓట్లను చీల్చడంలో సఫలీకృతమైందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ,మొదటిసారి ఓటు వేసిన యువతలో విజయ్ వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషణలు చెబుతున్నాయి.
ఓట్ల శాతం – ప్రభావం
విజయ్ పార్టీకి ఈ ఎన్నికల్లో 10 నుండి 15 శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఒక కొత్త పార్టీకి అద్భుతమైన ప్రారంభమే అయినప్పటికీ, సీట్ల రూపంలో అది ఎంతవరకు మారుతుందనేది ఉత్కంఠగా మారింది. విజయ్ చీల్చిన ఈ ఓట్లు డీఎంకేకు నష్టం చేస్తాయా లేక ఏఐఏడీఎంకేను దెబ్బతీస్తాయా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ విజయ్ పార్టీకి రెండంకెల ఓట్ల శాతం వస్తే, అది భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలను శాసించే కింగ్ మేకర్ స్థానానికి ఆయనను తీసుకెళ్లడం ఖాయం.
ఫ్యాన్స్ హడావుడి లెక్క వేరు
పోలింగ్ ముగిసిన క్షణం నుండి విజయ్ ఫ్యాన్స్ ప్రతి చిన్న అంశాన్ని విజయ్ విజయానికి సంకేతంగా మలుచుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరిగిన చోటల్లా విజయ్ ఎఫెక్ట్ అని, తగ్గితే మార్పు కోరుకుంటున్నారు అని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా, విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో ఒక కొత్త ఉత్తేజం వచ్చింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రావిడ పార్టీల గుత్తాధిపత్యానికి ఆయన ఒక గట్టి సవాల్ విసిరారు. విక్టరీ మనదే అని అభిమానులు ధీమాగా ఉన్నా.. అసలు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఒకవేళ విజయ్ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోయినా, ఆయన సాధించే ఓట్ల శాతం మాత్రం వచ్చే ఎన్నికల నాటికి ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెడుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







