కువైట్‌లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- April 26, 2026
కువైట్ సిటీ: తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ కార్యక్రమాలను కువైట్‌లో ఎన్నారై తెలుగుదేశం కమిటీ అత్యంత ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది. తారక రామారావు వర్ధంతి, యువనేత లోకేష్ బాబు జన్మదిన వేడుకలు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మహానాడు, అలాగే బాలకృష్ణ జన్మదిన వేడుకలు వంటి అనేక కార్యక్రమాలను భారీ స్థాయిలో నిర్వహిస్తూ కువైట్‌ను పార్టీకి కంచుకోటగా నిలిపినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వి.శ్రీశైలం అనారోగ్యంతో క్యాన్సర్‌కు గురయ్యారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ పార్టీకి నిరంతరం సేవలందిస్తున్న ఆయనకు చికిత్సకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలియడంతో, ఎన్నారై టిడిపి కువైట్ కమిటీ స్పందించింది.
ఎన్నారై టిడిపి గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు మరియు కమిటీ సభ్యులు కలిసి, ఆర్భాటాలకు దూరంగా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా శ్రీశైలం వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,21,900/- ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సహాయ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీశైలం సోషల్ మీడియాలో పార్టీకి ఎంతో ఉత్సాహంగా సేవలందిస్తున్నారని, ఇలాంటి కార్యకర్తలే పార్టీకి వెన్నెముకగా నిలుస్తారని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సహాయ కార్యక్రమంలో కుదరవల్లి సుధాకర రావు, మద్దిన ఈశ్వర్ నాయుడు,రషీద భేగం, బిల్లా రమేష్ యాదవ్, కుసుమే కుటుంబ రావు, ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, షేక్ బాషా, సుబ్బారావు, వి.సి. సుబ్బారెడ్డి, కొల్లి ఆంజనేయులు, గాజులపల్లి సుబ్బారెడ్డి, మొహమ్మద్, లాస్య మొబైల్స్ అధినేత తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం త్వరగా కోలుకుని తిరిగి పార్టీ సేవల్లో చురుకుగా పాల్గొనాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







