గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- September 30, 2026
మస్కట్ :గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) 2026లో ఒమన్ కీలక పురోగతి సాధించింది. ఇన్నోవేషన్ ఇన్పుట్స్ విభాగంలో 8 స్థానాలు ఎగబాకి 47వ స్థానానికి చేరుకుంది. గత ఏడాది 55వ స్థానంలో ఉన్న ఒమన్.. ఈసారి 47వ స్థానానికి చేరడం ఆ దేశంలో ఆవిష్కరణలకు అనుకూల విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడి వాతావరణం బలోపేతమవుతున్నాయనే విషయాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే మొత్తం గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్‌లో ఒమన్ 69వ స్థానంలోనే కొనసాగింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) ఏటా విడుదల చేసే ఈ సూచీలో ఈ ఏడాది 139 ఆర్థిక వ్యవస్థలను అంచనా వేశారు.
15 సూచీల్లో టాప్-40లో ఒమన్
రిపోర్టు ప్రకారం.. ఒమన్‌కు చెందిన 15 ఉప సూచీలు ప్రపంచంలోని టాప్-40 దేశాల్లో చోటు దక్కించుకున్నాయి.
- GDPలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ప్రవాహాల్లో 9వ స్థానం
- ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధిలో 14వ స్థానం
- ప్రతి 10 లక్షల జనాభాకు విద్యుత్ ఉత్పత్తిలో 16వ స్థానం
- వ్యాపార నిర్వహణలో విధాన స్థిరత్వంలో 18వ స్థానం
- ICT యాక్సెస్‌లో 20వ స్థానం
- సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) గ్రాడ్యుయేట్లలో 22వ స్థానం
- ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విధానాలు, సంస్కృతిలో 24వ స్థానం
- యూనివర్సిటీ–పరిశ్రమల పరిశోధన, అభివృద్ధి సహకారంలో 26వ స్థానం
ఆరు విభాగాల్లో పురోగతి
GIIలోని ఏడు ప్రధాన విభాగాల్లో ఒమన్ ఆరు విభాగాల్లో పురోగతి నమోదు చేసింది. సంస్థాగత వ్యవస్థ (Institutions) విభాగం 39వ స్థానంతో అత్యుత్తమంగా నిలిచింది. విధాన స్థిరత్వం, సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ దీనికి దోహదం చేశాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఒమన్ 54వ స్థానంలో, మార్కెట్ సోఫిస్టికేషన్‌లో 58వ స్థానంలో నిలిచింది. మార్కెట్ సోఫిస్టికేషన్ విభాగంలో గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 12 స్థానాలు మెరుగుపడింది.
కొన్ని కీలక సూచీల్లో ఒమన్ గణనీయమైన ఎగబాకింది. PPP ఆధారంగా ప్రతి బిలియన్ డాలర్ల GDPకి వచ్చిన వెంచర్ క్యాపిటల్ ఒప్పందాల సంఖ్యలో 32 స్థానాలు మెరుగుపడింది. అదేవిధంగా, PPP ఆధారంగా ప్రతి బిలియన్ డాలర్ల GDPకి మూల దేశం ప్రకారం పారిశ్రామిక డిజైన్ల సూచీలోనూ 32 స్థానాలు, వ్యాపార రంగంలో పనిచేస్తున్న పరిశోధనా ప్రతిభ శాతంలో 25 స్థానాలు పురోగతి సాధించింది. వ్యాపార రంగం నుంచి వచ్చే మొత్తం పరిశోధన, అభివృద్ధి (R&D) వ్యయంలో వాటా సూచీలో ఒమన్ 23 స్థానాలు మెరుగుపడి 33వ స్థానానికి చేరింది.
విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌లోనూ మెరుగుదల
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లోని టాప్-3 విశ్వవిద్యాలయాల సూచీలో ఒమన్ 16 స్థానాలు ముందుకు వచ్చింది. సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 334వ స్థానానికి చేరగా, యూనివర్సిటీ ఆఫ్ నిజ్వా, ధోఫర్ యూనివర్సిటీలు కూడా ప్రపంచ టాప్-1000 విశ్వవిద్యాలయాల్లో చోటు సంపాదించాయి.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్.. దేశాల ఆవిష్కరణ వ్యవస్థల బలాలు, పురోగతిని అంచనా వేసేందుకు విధాన నిర్ణేతలకు కీలక సాధనంగా పనిచేస్తుంది. జ్ఞానం, ఆవిష్కరణల ఆధారంగా స్థిరమైన అభివృద్ధి దిశగా దేశాలు ముందుకు సాగేందుకు ఈ సూచీ మార్గనిర్దేశం చేస్తుంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







