కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!

- April 28, 2026 , by Maagulf
కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!

దోహా: ఏటా ఏప్రిల్ 28న జరుపుకునే  'ప్రపంచ పని ప్రదేశ భద్రత మరియు ఆరోగ్య దినోత్సవం (World Day for Safety and Health at Work)' సందర్భంగా సిబ్బందికి సంబంధించి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాలను పెంపొందించే ప్రాముఖ్యతను ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ తెలియజేసింది.  వృత్తిపరమైన ప్రమాదాలను నివారించడంపై అవగాహన పెంచడం, ఉద్యోగుల మానసిక మరియు సామాజిక శ్రేయస్సుతోపాటు భౌతిక రక్షణకు భద్రతా సంస్కృతిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఆ సంస్థ తెలిపింది.  
ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా, ఈ సంవత్సరం తమ సంస్థ 'రెడీ అండ్ సేఫ్' అనే నినాదంతో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండటంపై దృష్టి సారించినట్టు పీహెచ్‌సీసీ (PHCC) భద్రత డైరెక్టర్ డాక్టర్ మరియం అల్ ముస్లేమానీ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాలలో అత్యవసర ప్రతిస్పందన విధానాలపై సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.  
ముఖ్యంగ ఒత్తిడితో కూడిన పరిస్థితులకు గురికావడం వల్ల సిబ్బందిపై ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని, ఇది వారి పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. కౌన్సెలింగ్ సేవలు మరియు పరస్పర సహకారంపై ఆధారపడిన కార్యాలయ సంస్కృతిని పెంపొందించడం ద్వారా ఇలాంటి సమస్యలను అడ్డుకోవచ్చని, ఇందుకోసం సమగ్ర మానసిక ఆరోగ్య సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో దీర్ఘకాలిక ప్రభావాలు తగ్గుతాయని మరియు ఉద్యోగులు తిరిగి తమ సాధారణ పనితీరు స్థాయిలకు వేగంగా చేరుకోవడానికి వీలవుతుందన్నారు. సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం అనేదిఉమ్మడి బాధ్యత అని, సంస్థలోని అన్ని స్థాయిల వారి సమిష్టి నిబద్ధత దీనికి అవసరమని డాక్టర్ మరియం అల్ ముస్లేమానీ స్పష్టం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com