ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- April 28, 2026
మస్కట్: ఒమన్‌లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఈ వారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40°C మార్కును దాటాయి. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో సుర్ మరియు హమ్రా అల్ దురూవా (ఇబ్రి)లో 43°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఫహూద్ (42.8°C), దిమా వత్తాయీన్ (42.4°C), మరియు అల్ ముధైబి (42.3°C) సహా పలు ఇతర ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వారం చివర్లో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°Cకి చేరవచ్చని తెలిపింది. ఎండలు అధికంగా నమోదువుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగవద్దని సూచించారు. తగినంత నీరు తాగాలని, వేడి సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు, అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) సంభవించవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. తగినంత నీరు త్రాగాలని మరియు ఎక్కువసేపు ఎండలో ఉండవద్దన్నారు. వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో అధిక సమయం గడిపితే.. అధిక చెమట, తలనొప్పి, కళ్లు తిరగడం, కండరాల నొప్పులు, కడుపు నొప్పి, చివరికి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలకు దారితీయవచ్చని డాక్టర్లు హెచ్చరించారు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేరాలని సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







