శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- April 28, 2026
గూడూరు: శిర్డీ సాయి భక్తులకు ఆనందాన్ని కలిగించే విశేష సంఘటనగా, శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం అధికారిక వెబ్‌సైట్‌ను పూజ్య మాతాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురు గురురాం రతంజీ పుణ్య తిథి సందర్భంగా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడుతూ, శిర్డీ సాయి సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఈ వెబ్సైట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భక్తులు మహాస్తూపం నిర్మాణ పురోగతి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తాజా సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో అనేక మంది భక్తులు, శిష్యులు పాల్గొని గురు రాం రతంజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచ నలుమూలల భక్తులు ఒకే వేదిక పైకి చేరి సాయి తత్వాన్ని అనుసరించేందుకు ప్రేరణ పొందుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వెబ్సైటు లింక్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://shirdisaishatabdimahastupam.com/
తాజా వార్తలు
- ఇరాక్ కొత్త ప్రధానిగా అలీ అల్-జైదీ
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్









