ఒమాన్ లో సలాలా టూరిజం ఫెస్టివల్ – 2015 ప్రారంభం

- July 24, 2015 , by Maagulf
ఒమాన్ లో సలాలా టూరిజం ఫెస్టివల్ – 2015 ప్రారంభం

ఒమాన్ లో ఈ గురువారం నుండి ఆగస్ట్ 31 వరకు "ఒమాన్: లవ్ అండ్ పీస్" పేరుతో సలాలా టూరిజం ఫెస్టివల్ - 2015  ప్రారంభమైంది. దీనిలో  వివిధ మతసంబంధ, ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక, వారసత్వ, క్రీడా మరియు వినోద కార్యక్రమాలు ఉంటాయి.  ఈ ప్రాంతాలలోనే పెద్ద ఉత్సవంగా గుర్తింపు పొందిన దీనిలో సంప్రదాయ హస్తకళలు, కళలు, క్రీడలు, భోజనం ఇంకా దుస్తులను ప్రతిబింబించేలా సంప్రదాయ గ్రామం మొదలైన ఆకర్షణీయమైన అంశాలను మనం చూడవచ్చు. ఈ ఉత్సవానికి వచ్చే అతిధులకు సరైన సదుపాయాలు, సేవలు కల్పించడం ద్వారా ఈ సంవత్సరం టూరిస్టు సీజన్ ను సఫలీకృతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఏజన్సీలు సిద్ధమౌతున్నాయి!

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com