కప్ప - కుందేలు
- July 24, 2015
ఊరికి అవతల ఉన్న ఒక చెరువులో ఒక కప్ప ఉండేది. దానకి ఆనుకుని ఉన్న ఒక చెట్టు పొదలో కుందేలు ఒకటి ఉండేది. ఆ రెండు స్నేహంగా ఉండేవి. ప్రతిరోజూ అవి రెండూ బయటికి వచ్చి కష్ట సుఖాలు మాట్లాడుకోనిదే వారికి రోజు గడిచేది కాదు. అలా ఉండగా ఒకరోజు కప్ప ఒక గెంతుతూ, గెంతుతూ ఒక గుంతలో పడిపోయింది. అందులోంచి బయటికి రాలేక భయపడుతూ కుందేలుతో నన్నెలాగైనా బయటికి లాగు మిత్రమా..అంటూ కేకలు పెట్టసాగింది. కుందేలు కప్పతో నీ బలాన్ని అంతా పుంజుకుని ఒక్కసారి గట్టిగా పైకి గెంతు మిత్రమా..నువ్వు పైకి రాగలవు. అని చెప్పింది. కానీ దాని మాటలు పట్టించుకోకుండా కప్ప భయపడుతూ ఏడ్చుకుంటూ ఉండిపోయింది. ఇంతలో కుందేలు ఏదైనా తాడుగానీ, కర్రగానీ అందిస్తాను ఉండు అని వెతకసాగింది. ఇంతలో గుంతలో చీకట్లో ఉన్న కప్పకి ఒక మూలగా పాకుతూ తనను మింగేయడానికి వస్తున్న పాము కనబడి, భయంతో చటుక్కున ఒక్క గెంతు గెంతింది. ఒక్క ఉదుటున ఒడ్డు మీదకొచ్చి పడింది. అప్పుడు కుందేలు కప్పతో చూశావా! మిత్రమా నేను రక్షిస్తాననే ధైర్యం నీలో శక్తిని చంపేసింది. కానీ నువ్వు చనిపోతావనే భయం నిన్ను అపాయం నుండి బయట పారేసింది. నీలో భయాన్ని పోగొట్టడానికే నేను ఒక తాడుని నువ్వున్న గుంతలోనికి పంపాను. అది నువ్వు పామనుకుని భయపడి బయటికి వచ్చేశావు అని కప్పని ఓదార్చింది. తెలివిగా తనను కాపాడిన కుందేలుకి కప్ప కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







