ఒమన్ తో ఇండస్ట్రియల్ సహకారంపై చర్చించిన అల్ఖోరాయెఫ్..!!
- April 28, 2026
రియాద్: సౌదీ అరేబియా పరిశ్రమలు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి బందర్ అల్ఖోరాయెఫ్.. ఒమన్ పబ్లిక్ అథారిటీ అధ్యక్షుడు ఖైస్ అల్-యూసెఫ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం, ఉమ్మడి పెట్టుబడులను అభివృద్ధి చేయడంపై వారు చర్చించారు.
సౌదీ మరియు ఒమన్ ఆర్థిక వ్యవస్థల పోటీతత్వాన్ని పెంచే విధంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను అభివృద్ధి చేసే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. పారిశ్రామిక మరియు పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నైపుణ్యం, ప్రాధాన్యత కలిగిన పారిశ్రామిక రంగాలలో నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించడం ప్రాముఖ్యతను ఇరుపక్షాలు తెలియజేశాయి. ఇది రెండు దేశాల జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటూ ఉమ్మడి ప్రయోజనాల సాధనకు దోహదపడుతుందన్నారు.
సౌదీ అరేబియా మరియు ఒమన్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, అలాగే రెండు దేశాల మధ్య ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ఏకీకరణ లక్ష్యాలను సాధించడానికి పారిశ్రామిక రంగంలో సహకారాన్ని పెంపొందించడంపై ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







