హర్మూజ్‌ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- April 28, 2026
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు, చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఇరాన్ చేసిన మూడు ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో అమెరికాకు ప్రతిపాదనలు చేసిన ఇరాన్.. తమ ఓడరేవులపై విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసి, పశ్చిమాసియాలో యుద్ధం ముగించాలని, అదే సమయంలో అణు కార్యక్రమంపై చర్చలు దౌత్య ప్రక్రియలో తదుపరి దశలో జరుగుతాయని కూడా స్పష్టం చేసింది.ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం..ఈ వారాంతంలో ఒమన్, పాకిస్థాన్‌లలో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సమర్పించిన ఈ ప్రతిపాదన, సంఘర్షణలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, చర్చలను తిరిగి ప్రారంభించేలా రూపొందించారు.
అయితే, ఇరాన్ ప్రతిపాదన పట్ల అధ్యక్షుడు ట్రంప్, జాతీయ భద్రతా బృందం సందేహాస్పదంగా ఉన్నాయని అమెరికా అధికారులు ‘ది న్యూయార్క్ టైమ్స్’కు తెలిపారు. ట్రంప్ ఈ ప్రతిపాదనపై ఎందుకు సంతృప్తి చెందలేదో స్పష్టంగా తెలియదు, కానీ ఇరాన్ ప్రతిపాదన అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేసేలా ఉంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ పదేపదే నొక్కిచెప్పారు. టెహ్రాన్‌కు అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే యుద్ధానికి గల కారణాలలో ఒకటి అని ఆయన చెబుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







