జూన్ 15 లోపు యూనిఫారాల పంపిణీ: సీఎం రేవంత్
- April 30, 2026
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖలో సమూల మార్పులు, విద్యార్థులకు సకాలంలో సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అవసరమైన వస్తువులన్నీ సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ద్యాశాఖ పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జూన్ 15 లోపు రాష్ట్రంలోని విద్యార్థులందరికీ యూనిఫారాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన జాప్యం పునరావృతం కాకూడదని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించే ప్రసంగే లేదని ఆయన కరాఖండీగా హెచ్చరించారు. విద్యా సంవత్సరం మొదలైన రోజే విద్యార్థులు నూతన దుస్తులతో పాఠశాలకు రావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
అవినీతికి తావులేకుండా, నాణ్యమైన వస్తువులను సరఫరా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు చేశారు.
పాఠశాల డ్రెస్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మరియు ఐడీ కార్డులను ‘సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్’ విధానం ద్వారానే సేకరించాలని ఆదేశించారు.
సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రతి మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఈ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ నిర్ణయం ద్వారా విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు అవసరమైన కిట్లు అందుతాయని, తద్వారా పేద విద్యార్థుల చదువుకు ఆటంకం కలగదని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







