కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

- April 30, 2026 , by Maagulf
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్

హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల రెక్కల కష్టం, వారి త్యాగాలు అమూల్యమైనవని కొనియాడారు. చారిత్రాత్మక మే డే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం, సబ్బండ కులాల కర్షక, కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాలను అమలు చేసిందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com