డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- May 01, 2026
మచిలీపట్టణం: మచిలీపట్టణం నడిబొడ్డున స్థానిక జిల్లాకోర్టు సెంటరు నందు 2 ఎకరాల విస్తీర్ణంలో డా.భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతుల జారీకి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయమై బందరు ఎంపీ బాలశౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు మచిలీపట్టణం పార్లమెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.
గతంలో మొదటి దశ నిర్మాణానికి కావలిసిన రూ.6.5 కోట్ల రూపాయలు గతంలోనే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు మంజూరు అయిన సంగతి విదితమే. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన స్థలమునకు సంబంధిచి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇంతకాలం జాప్యం ఏర్పడింది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనుమతులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బందరుకు తలమానికంగా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ వెల్లడించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









