పన్నీర్ చీజ్ బాల్స్
- August 06, 2016
కావల్సిన పదార్థాలు :
పనీర్ - 500 g (grated) , చీజ్ - 1 cup (grated) , ఉల్లిపాయలు - 1 cup , పచ్చిమిర్చి - 4 to 5 , బ్రెడ్ పొడి - 1/2 cup , బంగాళదుంపలు - 1/2 cup , కార్న్ ఫ్లోర్ - 1/2 cup , కారం - 1/2 teaspoon , ఉప్పు: రుచికి సరిపడా నూనె తగినంత
తయారుచేయు విధానం :
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, పనీర్ తురుము మరియు చీజ్ తురుము వేయాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, బంగాళదుంప, కారం వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి . తర్వాత ఈ మిశ్రమం నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత , స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చయాలి. నూనె వేడి అయ్యాక పనీర్ చీజ్ బాల్స్ బ్రెడ్ పొడిలో పొర్లించి తర్వాత కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొన్న తర్వాత వీటిని ప్లేట్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. అంతే హాట్ హాట్ పనీర్ బాల్స్ రెడీ, వీటిని టమోటో సాస్ తో సర్వ్ చేయండి..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







