లక్ష్మణ ఫలం తో క్యాన్సర్ నివారణ...

- August 06, 2016 , by Maagulf
లక్ష్మణ ఫలం తో  క్యాన్సర్ నివారణ...

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. మనిషిని నిలువునా కుంగదీసే మహమ్మారి. క్యాన్సర్ సోకిందంటే ఖరీదయిన చికిత్స తప్పనిసరి. ఈ వ్యాధికి బలైపోయిన పేదలెందరో. రాచపుండు బారినపడి మృత్యువు కోసం వేచిచూడటం తప్ప చికిత్స చేయించుకునే స్థోమతలేని వారు ఎందరో ఉన్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు రేడియేషన్ థెరపీ మినహా మరోమార్గంలేదు. అయితే తాజాగా ఓ మధుర ఫలం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు. సీతాఫల జాతికి చెందిన అన్నోనా మ్యూరికేటాపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో తామీ విషయాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
అన్నోనా మ్యూరికేటా సాధారణ పేరు లక్ష్మణ ఫలం. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం అని శాస్త్రవేత్తల విశ్వాసం. ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్ కు క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం ఉందని వారంటున్నారు. అంతేకాక ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు. అన్నోనా మ్యూరికేటా క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటిదని చెప్తున్నారు. ఈ ఫలంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ పండు క్యాన్సర్ ను నిరోధించగలదని తేలితే అందరికీ సంతోషమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com