ప్రార్థన పేలవ ఆటతీరు భారత్‌ విజయావకాశాల్ని దెబ్బతీసింది..

- August 06, 2016 , by Maagulf
ప్రార్థన పేలవ ఆటతీరు భారత్‌ విజయావకాశాల్ని దెబ్బతీసింది..

 బ్రెజిల్‌లో జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న భారత్‌కు టెన్నిస్‌ విభాగంలో వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన సానియా మీర్జా- ప్రార్థన తోంబ్రే జోడి చైనా క్రీడాకారిణులు జంగ్‌- పెంగ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. సానియా మీర్జా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నా ప్రార్థన పేలవ ఆటతీరు భారత్‌ విజయావకాశాల్ని దెబ్బతీసింది. దీంతో మ్యాచ్‌ను సానియా జోడి 6-7, 5-7, 7-5 తేడాతో చేజార్చుకుంది. ఇక టెన్నిస్‌లో భారత్‌ ఆశలు సానియా మీర్జా- రోహన్‌ బోపన్న పోటీపడనున్న మిక్స్‌డ్‌ డబుల్స్‌పైనే ఉన్నాయి. ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో పేస్‌- బోపన్నల జోడి తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com