బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- May 02, 2026
కువైట్ సిటీ: బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జ్లీబ్ అల్-షయూఖ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రజా రవాణా సంస్థకు చెందిన టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణికుల వద్ద వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.
పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారి నేరాలను నిర్ధారించారు.
నిందితుల వద్ద నుంచి దొంగిలించినట్లు భావిస్తున్న 333 కువైట్ దీనార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజా రవాణా సేవలను ఉపయోగించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







