న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- May 03, 2026
మనామాః బహ్రెయిన్ న్యాయవ్యవస్థ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ముగ్గురు ఎంపీలను వారి పదవుల నుండి తొలగించాలని పది మంది ఎంపీలు పార్లమెంటును కోరారు. వారు తమ ప్రమాణాన్ని ఉల్లంఘించారని, సభలో కొనసాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. స్పీకర్‌కు పంపిన ఈ అభ్యర్థనలో అబ్దుల్‌నబీ సల్మాన్ నాసర్, మమ్దూ అబ్బాస్ అల్ సలేహ్ మరియు మెహదీ అబ్దుల్ అజీజ్ అల్ షువైఖ్‌లను సభ్యత్వం నుండి తొలగించాలని పేర్కొన్నారు.
సదరు ఎంపీలు బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. వారు తమ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారని పేర్కొన్నారు. ఇది జాతీయ ఐక్యతను మరియు ఎన్నికైన అధికారుల విధులను ఉల్లంఘించడమేనని తమ అభ్యర్థనలో ఎంపీలు తెలిపారు. ఈ మేరకు మహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్, హమద్ ఫరూక్ అల్ దోయ్, జమీల్ ముల్లా హసన్, బాదర్ అల్ తమీమి, మహ్మద్ అల్ బలూషి, అలీ సకర్ అల్ దోసారి, అబ్దుల్లా అల్ రుమైహి, మహ్మద్ అల్ ఒలైవి, అబ్దుల్లా అల్ ధాన్ మరియు మహ్మద్ అల్ రిఫాయ్ స్పీకర్ కు అభ్యర్థనను సమర్పించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







