స్నేహితుల దినోత్సవం రోజున మోదీ పర్యటన ఆనందదాయకo

- August 07, 2016 , by Maagulf
స్నేహితుల దినోత్సవం రోజున మోదీ పర్యటన ఆనందదాయకo

ప్రధాని హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్రమోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్వాగతం పలికారు. స్నేహితుల దినోత్సవం రోజున మోదీ పర్యటన ఆనందదాయకమని ట్వీట్‌ చేశారు. ప్రధాని పర్యటనతో కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత స్నేహపూర్వక తోడ్పాటు ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ మెదక్‌జిల్లా గజ్వేల్‌ మండలం కోమటి బండలో మిషన్‌భగీరథ మొదటి దశను ప్రారంభించనున్నారు. అనంతరంరామగుండంలో 166 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్కేంద్రం, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌లకు శంకుస్థాపన శిలాపలకాలను ఆవిష్కరిస్తారు. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో ప్రత్యేకత ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com