ముంబై సమీపంలోని భివండి లో రెండంతస్థుల భవనం కూలిపోయింది..

- August 07, 2016 , by Maagulf
ముంబై సమీపంలోని భివండి లో రెండంతస్థుల భవనం కూలిపోయింది..

మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలోని భివండి ప్రాంతంలో రెండంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థానిక కళ్యాణ్‌ రోడ్డులోని రెండు అంతస్థులభవనం ఒక్కసారిగా కుప్పకూలింది.థానే మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకూ నలుగురిని శిథిలాల నుంచి బయటికి వెలికితీశారు.మరో ఎనిమిది మంది రాళ్ల మధ్య చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత ఆదివారం భివండి ప్రాంతంలోనే రెండు అంతస్థుల భవనం కూలి 9మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com