విజయవాడ స్వరాజ్ మైదానంలో తితిదే నమూనా ఆలయం..
- August 07, 2016
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ స్వరాజ్ మైదానంలో తితిదే నమూనా ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. పవిత్ర కృష్ణా జలాలతో ఆలయంలో సంప్రోక్షణ అనంతరం.. శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు స్వరాజ్ మైదానంలో నమూనా ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. రోజూ లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తిరుమలలో మాదిరిగానే నిత్యం స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తారు. నమూనా ఆలయంలో స్వామివారిని తొలుత కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







