విజయవాడ స్వరాజ్‌ మైదానంలో తితిదే నమూనా ఆలయం..

- August 07, 2016 , by Maagulf
విజయవాడ స్వరాజ్‌ మైదానంలో తితిదే నమూనా ఆలయం..

 కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడ స్వరాజ్‌ మైదానంలో తితిదే నమూనా ఆలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు. పవిత్ర కృష్ణా జలాలతో ఆలయంలో సంప్రోక్షణ అనంతరం.. శాస్త్రోక్తంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు స్వరాజ్‌ మైదానంలో నమూనా ఆలయం భక్తులకు అందుబాటులో ఉంటుంది. రోజూ లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా తితిదే ఏర్పాట్లు చేసింది. తిరుమలలో మాదిరిగానే నిత్యం స్వామివారికి పూజాదికాలు నిర్వహిస్తారు. నమూనా ఆలయంలో స్వామివారిని తొలుత కంచి పీఠాధిపతి జయేంద్రసరస్వతి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తితిదే ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com