పిటా నికోలస్ అమ్మాయిల హృదయాలలో..
- August 07, 2016
తైక్వాండో ఆటగాడు పిటా నికోలస్ టఫాటోఫౌ ఈసారి ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచినా.. గెలువకపోయినా.. అప్పుడే అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టాడు. అట్టహాసంగా వైభవోపేతంగా జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా పిటా నిలిచాడు.నిన్నమొన్నటివరకు టోంగా దేశం ఉందనే విషయం చాలామందికి తెలిసే అవకాశం లేకపోవచ్చుగానీ.. చొక్కా విప్పేసి.. కండలకు మాంఛిగా నూనె పట్టి.. టోంగా ఆటగాళ్ల బృందం తరఫున జెండా పట్టుకొని కవాతు చేసిన పిటా అందరి దృష్టి ఆకర్షించాడు. టోంగా సంప్రదాయ వేషధారణలో అతను చేసిన కవాతుపై ట్విట్టర్లో ఛలోక్తులు వెల్లువెత్తుతున్నాయి.నిన్నటివరకు టోంగా ఎక్కడుందో ఎవరికీ తెలియకపోయినా.. ఇక అమ్మాయిలంతా టోంగాకు క్యూ కడతారని, రానున్న రెండువారాలూ అమ్మాయిల గుండెల్లో పిటా చైర్ వేసుకొని కూర్చుంటాడని ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. రిక్షా తొక్కిన సౌదీ చిన్నది! ఇక సంప్రదాయ దేశమైన సౌదీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ కవాతు సందర్భంగా కొంత వినూత్నంగా కొంత విచిత్రంగా వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. సౌదీ అరేబియా బోర్డు, చెట్లు, మొక్కలు ఉన్న రిక్షాను తొక్కుతూ క్రీడాకారిణి మారకానా తమ బృందాన్ని ముందుకు నడిపింది. మహిళలు పార్కుల్లో సైకిల్ తొక్కేందుకు సౌదీ మతగురువులు 2013లో అనుమతి ఇచ్చారు. ఆ ప్రకారమే మొక్కలతో ఉన్న రిక్షాను క్రీడాకారిణి తొక్కుతూ ముందుకు సాగింది.2012 లండన్ ఒలింపిక్స్‌లో తొలిసారి తమ దేశం తరఫున మహిళలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు సౌదీ అనుమతిచ్చింది. అప్పట్లో ఇద్దరు క్రీడాకారుణులు పాల్గొనగా.. ఇప్పుడు 12మంది మగువలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







