Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- May 04, 2026
యూఏఈః దుబాయ్ నివాసి అయిన భారతీయ ప్రవాసి అబ్దుల్ రషీద్ అల్లిప్రా వలప్పిల్ అబ్దు ఏకంగా Dh25 మిలియన్ల భారీ మొత్తాన్ని గెలుచుకున్నారు. మే 3న జరిగిన బిగ్ టిక్కెట్ అబుధాబి (Big Ticket Abu Dhabi) డ్రాలో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 19న 012318 టికెట్ నంబరును కొనుగోలు చేసినట్లు, అదే తనకు విజయాన్ని అందించిందని హర్షం వ్యక్తం చేశారు. గత ఆరేళ్లుగా టికెట్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపాడు. నిర్వాహకులు తాను Dh25 మిలియన్లు గెలుచుకున్నానని చెప్పినప్పుడు, నమ్మలేకపోపోయినట్లు వెల్లడించారు.
అబ్దు కేరళకు చెందిన 48 ఏళ్ల డ్రైవర్. ఈయన గత 17 ఏళ్లుగా దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆయన కుటుంబం భారతదేశంలో ఉండగా, అబ్దు మాత్రం యూఏఈలో నివసిస్తున్నారు. స్నేహితులు మరియు సోషల్ మీడియా ద్వారా Big Ticket గురించి మొదటిసారి విన్నప్పటి నుండి, ఆయన ప్రతి నెలా టికెట్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గెలుచుకున్న బహుమతికి సంబంధించి తన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు.
ఇతర బహుమతులు
Dh1 మిలియన్ విలువైన ఐదు కన్సోలేషన్ బహుమతుల విజేతలు:
టికెట్ నంబరు 121930 — అజ్మాన్‌కు చెందిన భారతీయ ప్రవాసి లియో లొరెంజ్.
టికెట్ నంబరు 378830 — దుబాయ్‌కు చెందిన భారతీయ ప్రవాసి రితేష్ లోబో.
టికెట్ నంబరు 321146 — దుబాయ్‌కు చెందిన భారతీయ ప్రవాసి రజత్ సతీష్.
టికెట్ నంబరు 245762 — దుబాయ్‌కు చెందిన భారతీయ ప్రవాసి చైతన్య రామచంద్రన్‌కు.
టికెట్ నంబరు 120705 — ఒమన్‌కు చెందిన భారతీయ ప్రవాసి మురళి వజాయిల్.(డ్రీమ్ కార్ విజేత)
అబుదాబిలో నివసిస్తున్న భారతీయ ప్రవాసి అష్రఫ్ అబ్దుల్లా 022963 టికెట్ నంబర్‌తో డ్రీమ్ కార్ డ్రాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను గెలుచుకున్నారు. కేరళకు చెందిన 41 ఏళ్ల ఈ డ్రైవర్..తొమ్మిదేళ్లుగా పాల్గొంటున్న తర్వాత తన మొదటి బిగ్ టికెట్ విజయాన్ని అందుకున్నాడు. ఎప్పటికైనా గెలుస్తాననే ఆశతో ప్రతి నెలా టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







