కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- May 04, 2026
త్రివేండ్రం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ కేరళ ఓటర్లు మార్పు కోరుతూ స్పష్టమైన తీర్పునిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. పాలక పక్షమైన ఎల్డీఎఫ్ (LDF) దుష్పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని థరూర్ పేర్కొన్నారు. కొందరు మంత్రులకు వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ, ఓటర్లు ప్రభుత్వం మారాలని నిర్ణయించుకున్నారని ఆయన విశ్లేషించారు.
కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు థరూర్ నేరుగా పేరు చెప్పకుండా.. ప్రస్తుతం తమ దృష్టంతా చారిత్రక విజయంపైనే ఉందని వ్యాఖ్యానించారు. 99 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం శుభపరిణామమని, కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని అన్నారు.తాజా ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎల్డీఎఫ్ 50 లోపు స్థానాలకు పరిమితమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సుమారు 5 స్థానాల్లో గట్టి పోటీనిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్ గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం.. సీఎం పదవి కోసం ముగ్గురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







