మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- May 06, 2026
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ చేపల పోటీ మూడవ ఎడిషన్ మే 13 నుండి 16 వరకు జరుగనుంది. ఖతార్ జలాల్లో నాలుగు రోజుల పాటు జరిగే పోటీ చేపల వేట కోసం ఖతార్ నలుమూలల నుండి జట్లు పాల్గొంటాయి. అన్ని రకాల నౌకలకు సముద్రయానాన్ని పూర్తిగా పునఃప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోటీలపై ఆసక్తి నెలకొన్నది.
ఈ సీజన్‌లో 132 జట్ల నుండి 578 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీలో ఇప్పటివరకు జరిగినవాటిలోకెల్లా అత్యంత విలువైన బహుమతులను అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు GWM ట్యాంక్ 500, రెండవ స్థానానికి GWM ట్యాంక్ 300, మరియు మూడవ స్థానానికి హవాల్ H9 వాహనం ఉంటాయి. నాలుగో స్థానంలో నిలిచిన విజేతకు హలౌల్ బోట్ ఫ్యాక్టరీ అందించిన పడవ లభిస్తుంది. ఐదవ స్థానం నుండి పదవ స్థానం వరకు నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు.
పోటీలో భాగంగా ఆయా జట్లు అతిపెద్ద కింగ్‌ఫిష్ (కనాడ్) కోసం పోటీ పడటానికి ఓల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరుతాయి. పట్టుకున్న చేపల బరువు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీ, మే 16(శనివారం) సాయంత్రం ఓల్డ్ దోహా పోర్ట్‌లో జరిగే న్యాయనిర్ణయం మరియు బహుమతుల ప్రదానోత్సవంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







