IPL 2026: ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI..
- May 06, 2026
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వేదికను మార్చారు.
ఐపీఎల్ 2026లో లీగ్ స్టేజీ మ్యాచ్‌లు మే 24తో ముగుస్తాయి. మే 26న క్వాలిఫయర్ 1 జరగనుంది. ఈ మ్యాచ్‌కు ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టాప్-2 జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగుపెడుతుంది.
పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడనున్నాయి. మే 27న జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పోటీపడనుంది.
మే 29న క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు కూడా న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఇక మే 31న ఫైనల్ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఐపీఎల్ 2026 విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడుతుంది.
ఫైనల్ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే.. మా నిర్దేశిత మార్గదర్శకాలు, నిబంధనల పరిధికి లోబడేలా లోకల్ అసోసియేషన్, అధికారుల రిక్వైర్‌మెంట్స్ లేకపోవడంతో వేదికను మార్చినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
- మే 26న – క్వాలిఫయర్ 1 – HPCA స్టేడియం, ధర్మశాల
- మే 27న – ఎలిమినేటర్ – న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
- మే 29న – క్వాలిఫయర్ 2 – న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూ చండీగఢ్
- మే 31న – ఫైనల్ మ్యాచ్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
తాజా వార్తలు
- నార్త్ అల్ బటిన్హాలో టొబాకో తయారీ యూనిట్ సీజ్..!!
- కార్మికుల హక్కులు, సంస్కరణలపై ఫస్ట్ జాయింట్ మీటింగ్..!!
- దుబాయ్‌లోని ఖోర్ అల్ మమ్జర్ బీచ్ ప్రారంభం..ప్రత్యేకతలివే..!!
- యాత్రికుల మానసిక ఆరోగ్యం కోసం బుక్ విడుదల..!!
- డిజిటల్ వ్యవస్థలతో నియామక ప్రక్రియలు వేగవంతం..!!
- దౌత్యపరమైన ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతు..!!
- 'స్పెషల్ రైల్వే ప్రాజెక్టులు'గా గుర్తించడం పట్ల ఎంపీ అర్వింద్ హర్షం
- IPL 2026: ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI..
- అర్ధరాత్రి మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు..40 మంది పోకిరీలు చుట్టుముట్టి..
- DMKకి భారీ షాక్..టీవీకేకి మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ..









