డిజిటల్ వ్యవస్థలతో నియామక ప్రక్రియలు వేగవంతం..!!
- May 06, 2026
మనామా: బహ్రెయిన్ నియామక ప్రక్రియను పూర్తిగా డిజిటలీకరణ చేయనున్నారు. సేవా నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రక్రియలను సులభతరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా డిజిటల్ సేవను ప్రవేశపెడుతున్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సేవతో జాతీయ ఉపాధి వేదిక ద్వారా యజమానులు మంత్రిత్వ శాఖ సమన్వయకర్తలతో నేరుగా మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఇది నియామక ప్రక్రియలపై వేగవంతంతోపాటు ఇంటర్వ్యూ మొత్తం పూర్తి డాక్యుమెంటేషన్‌ను కూడా ఇస్తుందన్నారు.
డిజిటల్ సేవలను అందించే ఒప్పందాలలో కనీసం 25 శాతం మెరుగుదలను సూచిస్తుంది. ఈ సేవ పూర్తిగా డిజిటలైజ్ చేయబడిందని, జాతీయ వేదిక ద్వారా ఇప్పుడు 100 శాతం ప్రక్రియలు ఎలక్ట్రానిక్‌గా నిర్వహించబడుతున్నాయని, అలాగే విధానపరమైన దశలు పూర్తిగా ఆటోమేట్ చేయబడ్డాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ అప్డేట్ వెర్షన్ లబ్ధిదారులకు సమయం మరియు శ్రమను ఆదా చేయడంతో పాటు మొత్తం ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో మెరుగైన యూజర్ ఇంటర్‌ఫేస్, ఈజీ ప్రక్రియలు ఉన్నాయని తెలిపింది.
ప్రభుత్వ సేవలను ఆధునీకరించే విస్తృత ప్రభుత్వ కార్యక్రమాలలో భాగంగా ఈ అభివృద్ధి జరిగిందని తెలిపింది. ఇందులో భాగంగా 1,300కు పైగా సేవలు ఉన్నాయని, వీటిలో సుమారు 800 సేవలు, "తవాసుల్" అనే జాతీయ సూచనలు మరియు ఫిర్యాదుల వ్యవస్థ నుండి వచ్చిన అభిప్రాయాలతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







