దౌత్యపరమైన ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతు..!!
- May 06, 2026
జెడ్డా: మిడిలీస్టులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించాల్సిన ఆవశ్యకతను సౌదీ మంత్రివర్గం స్పష్టం చేసింది. అభద్రత మరియు అస్థిరత నుండి ఈ ప్రాంతాన్ని కాపాడే రాజకీయ పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో మధ్యవర్తిత్వానికి, దౌత్యపరమైన ప్రయత్నాలకు సౌదీ అరేబియా మద్దతు తెలిపింది. జెడ్డాలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు.
హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను ఫిబ్రవరి 28కి ముందున్న స్థితికి పునరుద్ధరించడం, తద్వారా నౌకల సురక్షితమైన మరియు నిరాటంకమైన ప్రయాణాన్ని నిర్ధారించే ప్రాముఖ్యతను మంత్రివర్గం పునరుద్ఘాటించింది.
అంతకుముందు రెండు పవిత్ర మసీదుల సంరక్షకులు సౌదీ అరేబియా రాజు సల్మాన్ మరియు తనకు జింబాబ్వే అధ్యక్షుడు ఎమ్మర్సన్ మ్నాంగాగ్వా, రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ మరియు జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి నుండి అందిన సందేశాలలోని విషయాలను క్రౌన్ ప్రిన్స్ క్యాబినెట్‌కు వివరించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో తాను ఇటీవల జరిపిన ఫోన్ సంభాషణ గురించి కూడా క్యాబినెట్‌కు తెలియజేశారు.
సమావేశం అనంతరం మీడియా మంత్రి సల్మాన్ అల్-దోస్సరీ మాట్లాడుతూ.. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో సౌదీ అరేబియా పాల్గొనడం వల్ల కలిగే ఫలితాలను క్యాబినెట్ చర్చించిందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధికి సంబంధించిన జాతీయ లక్ష్యాలను సాధించడంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు "సౌదీ పర్యావరణ వారోత్సవాలు 2026"ను ప్రారంభించడాన్ని మంత్రివర్గం పరిశీలించిదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రక్షిత ప్రాంతాల విస్తీర్ణాన్ని నాలుగు రెట్లు పెంచడం, పది లక్షల హెక్టార్లకు పైగా ఎడారిగా మారిన భూమిని పునరుద్ధరించడం, పునరుత్పాదక నీటి వనరులను ఉపయోగించి 159 మిలియన్ల చెట్లను నాటనున్నారు.
మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించిన గృహ కార్మిక వృత్తులకు సంబంధించి వివరాలను తెలియజేశారు. నియామకం, ఎగ్జిట్ మరియు రీ ఎంట్రీ వీసాలు, అలాగే రెసిడెన్సీ అనుమతుల జారీ మరియు పునరుద్ధరణకు సంబంధించిన రుసుములను దివ్యాంగుల కోసం ప్రభుత్వమే భరించాలని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.
తాజా వార్తలు
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్‌కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్‌కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!









