విజయ్‌కు లైన్‌క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- May 07, 2026
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అనుమతి ఇచ్చారు. గురువారం ఉదయం 11గంటల సమయంలో విజయ్ లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మరోసారి కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని తెలిపారు. తాము అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను టీవీకే అధినేత విజయ్ పలువురు ఎమ్మెల్యేలతో కలిశారు. అయితే, స్పష్టమైన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. తాజాగా, గురువారం ఉదయం 11గంటలకు మరోసారి లోక్‌భవన్‌లో గవర్నర్‌తో టీవీకే విజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ గవర్నర్ ను కోరారు.
మీకు ఏఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.. బలం ఎలా నిరూపించుకుంటారంటూ విజయ్ ను గవర్నర్ ప్రశ్నించారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా? అంటూ గవర్నర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత బలం మా వద్ద ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని విజయ్ గవర్నర్ కు తెలిపారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇవాళ లేదంటే రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే పార్టీకి 108 స్థానాలు వచ్చాయి. అయితే, విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఆయన్ను ఒక్క స్థానంనుంచే పరిగణలోకి తీసుకుంటారు. దీంతో టీవీకే పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క. కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. వీసీకే, సీపీఐలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరితోపాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు ఇస్తామని తెలిపినట్లు సమాచారం.. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 118 మంది సభ్యుల బలం సమకూరినట్లు అవుతుంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







