ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- May 07, 2026
న్యూ ఢిల్లీ: మూడో సారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తుండటంతో పార్టీలోని నేతలంతా సమన్వయం కావడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటి దాకా పార్టీలో నాలుగు గ్రూపులుగా రాజకీయాలు నడిచాయి. నతేల మధ్యా ఆధిపత్య పోరు, పార్టీ లైన్ దాటి ఎవరికి వారే స్టేట్ మెంట్లు ఇస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాక ముందు నుంచే ఢిల్లీ నుంచి ఇక్కడి నేతలకు ఆదేశాలు వస్తున్నాయంట. అందరూ కలిసికట్టుగా ఉండాలని పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవంటూ అమిత్ షా నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే వార్నింగులు వచ్చినట్టు తెలుస్తోంది. నరేంద్ర మోడీ పర్యటన కేవలం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా.. ఇక్కడి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఉపయోగపడేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకే నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టకముందే నేతలను సమన్వయం చేసినట్టు సమాచారం. చాలా కాలంగా నడుస్తున్న విభేదాలకు చెక్ పెట్టబోతున్నారంటే నరేంద్ర మోడీ. ఈ దెబ్బతో బీజేపీకి రాష్ట్రంలో మళ్లీ బూస్ట్ వస్తుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ దూసుకుపోతున్నాయి. వరుస ప్రోగ్రామ్స్, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తెలంగాణకు మోడీ వస్తే కాషాయ పార్టీలో జోష్ పెరుగుతుందని అంతా అంచనా వేస్తున్నారు. అందుకే ఈ మధ్య పార్టీ నేతలు ఒక్క తాటిమీదకు వచ్చి మోడీ పర్యటనపై సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి మోడీ రాక పార్టీకి ఏ మేరకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్‌లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







