కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- May 08, 2026
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్-19 మహమ్మారి మర్చిపోకముందే, అంతకంటే ప్రమాదకరమైన హంతా వైరస్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ అలర్ట్ ప్రకటించింది. హంతా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని, దీని నియంత్రణకు అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
తాజాగా నెదర్లాండ్స్‌కు చెందిన ఒక క్రూయిజ్ షిప్‌లో హంతా వైరస్ కలకలం రేపింది. ఈ నౌకలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు వైరస్ బారినపడి మరణించడం అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీసింది. మరణించిన వారు తక్కువ సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఈ షిప్‌లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఆయా దేశాలన్నీ తమ పౌరుల ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.
హంతా వైరస్ సాధారణంగా ఎలుకలు, ఇతర రోడెంట్స్ ద్వారా మనుషులకు సోకుతుంది. ఇది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కోవిడ్‌తో పోలిస్తే దీని మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రూయిజ్ షిప్‌లో మరణాలు సంభవించడంతో, ఆ నౌకను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాలు విమానాశ్రయాలు, రేవు పట్టణాల్లో నిఘా పెంచాలని అధికారులు ఆదేశించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







