యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- May 08, 2026
హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న పొట్ట...భరించలేని కడుపునొప్పి...గర్భిణిలా మారిన శరీరాకృతి... చివరకు పరీక్షలు చేయించుకోగా ఫుట్‌బాల్ సైజ్‌లో ఉన్న భారీ అండాశయ కణితి బయటపడింది. ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ క్లిష్ట పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి 35 ఏళ్ల (Bodapatla Village Douthabad Sangareddy Dist) యువతికి కొత్త జీవితం అందించారు.
టి.సంధ్య అనే యువతి గత రెండు వారాలుగా తీవ్రమైన కడుపునొప్పి, పొట్ట బరువుగా ఉండటం, క్రమంగా పొట్ట అసాధారణంగా పెరగడం వంటి సమస్యలతో బాధపడుతోంది. మొదట సాధారణ గ్యాస్ లేదా జీర్ణకోశ సమస్య అనుకుని స్థానికంగా చికిత్స తీసుకుంది. అయితే నొప్పి రోజురోజుకూ పెరగడంతో పాటు పొట్ట గర్భిణిలా కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ పరిస్థితిలో సంధ్య డాక్టర్ జి.భవ్య - Senior Obstetrician & Gynecologist Laproscopic & Fertility Specialist ను మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్‌లో సంప్రదించింది. రోగిని పరీక్షించిన వైద్యులు ఆమె ఉదర భాగమంతా ఆక్రమించిన భారీ సిస్టిక్ మాస్‌ను గుర్తించారు. సంధ్య పొట్ట 30 వారాల గర్భిణిలా కనిపించిందని వైద్యులు తెలిపారు.
అల్ట్రాసౌండ్, CECT Abdomen & Pelvis స్కానింగ్‌లలో కుడి అండాశయం నుంచి ఉద్భవించిన సుమారు 14.1 x 20.3 x 19.5 సెం.మీ పరిమాణంలో భారీ ఓవేరియన్ సిస్ట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కణితి ఫుట్‌బాల్ పరిమాణంలో ఉండటం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇలాంటి భారీ అండాశయ కణితులు చాలా అరుదుగా కనిపిస్తాయని, సరైన సమయంలో చికిత్స అందకపోతే కణితి పగిలిపోవడం, అంతర్గత రక్తస్రావం, అండాశయం మెలికలు తిరగడం, సమీప అవయవాలపై ఒత్తిడి పెరగడం, శ్వాస సమస్యలు రావడం వంటి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కొన్నిసార్లు ఇలాంటి కణితుల్లో క్యాన్సర్ దాగి ఉండే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొన్నారు.
CEA, CA-125 వంటి ట్యూమర్ మార్కర్ పరీక్షలు నిర్వహించగా అవి సాధారణ స్థాయిలోనే ఉండటంతో కణితి బెనైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. అయినప్పటికీ కణితి భారీ పరిమాణం, క్లిష్టత దృష్ట్యా గైనకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం శస్త్రచికిత్సకు ప్రణాళిక రూపొందించింది. ప్రమాదాలు, శస్త్రచికిత్స క్లిష్టత గురించి కుటుంబ సభ్యులకు వివరించిన అనంతరం ఓపెన్ సర్జరీ నిర్వహించారు.డాక్టర్ జి. భవ్య ఆధ్వర్యంలో, డాక్టర్ ఎస్. రఘు రామిరెడ్డి సహకారంతో వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించింది.
శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తనాళాలు కలిగిన భారీ కణితిని వైద్యులు ఎలాంటి రప్చర్ కాకుండా పూర్తిగా తొలగించారు. అనంతరం ఫ్రోజెన్ సెక్షన్ బయాప్సీ చేయగా అది బెనైన్ మ్యూసినస్ సిస్టాడెనోమా అని నిర్ధారణ అయింది. ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు.అదేవిధంగా ఎడమ అండాశయంలో ఉన్న చిన్న సిస్ట్‌ను కూడా తొలగించి, గర్భాశయం మరియు ఆరోగ్యకరమైన ప్రజనన అవయవాలను కాపాడగలిగామని తెలిపారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా కోలుకుంటోందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ జి. భవ్య మాట్లాడుతూ: “రోగి మా వద్దకు వచ్చే సమయానికి కణితి దాదాపు మొత్తం ఉదర భాగాన్ని ఆక్రమించింది. మరికొంత ఆలస్యం జరిగి ఉంటే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉండేది. ఇలాంటి భారీ కణితులు యువతుల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్‌లో ఆమె తల్లి అయ్యే అవకాశాన్ని కూడా కాపాడగలిగాం” అని తెలిపారు.
డాక్టర్ ఎస్. రఘు రామిరెడ్డి- Surgical Oncologist మాట్లాడుతూ: “ఇంత పెద్ద ఓవేరియన్ ట్యూమర్లు కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌లా కనిపిస్తాయి. ట్యూమర్ పరిమాణం, రక్తనాళాల విస్తృతి, సమీప అవయవాలపై ఒత్తిడి కారణంగా శస్త్రచికిత్స చాలా క్లిష్టంగా మారుతుంది. సరైన సమయంలో ఆసుపత్రికి రావడం వల్లే ఈ యువతి ప్రాణాలను కాపాడగలిగాం” అని తెలిపారు.
ఆరోగ్యంగా కోలుకున్న సంధ్య భావోద్వేగంతో మాట్లాడుతూ: “నా పొట్ట గర్భిణిలా పెరగడంతో చాలా భయపడ్డాను. నొప్పి కూడా తట్టుకోలేని స్థాయిలో ఉండేది. నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ మెడికవర్ వైద్యులు నాకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు మళ్లీ కొత్త జీవితం దక్కినట్లుంది” అని తెలిపింది.
మహిళలు కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, ఆకలి తగ్గడం, పొట్ట అసాధారణంగా పెరగడం, పొట్ట బరువుగా అనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సతో మరోసారి మెడికవర్ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్న ఆధునిక వైద్యసేవలు, నిపుణుల బృందం, అత్యాధునిక శస్త్రచికిత్స నైపుణ్యం ప్రతిఫలించిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్‌లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







