ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- May 08, 2026
హైదరాబాద్: “ఇతరులకు సేవ చేయడమే మనిషి జీవితానికి నిజమైన అర్థం” అని, మానవ సేవనే జీవిత పరమార్థంగా భావించాలనీ తెలంగాణ గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో గురువారం లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ థలసేమియా దినోత్సవం నిర్వహించారు.
రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనెంట్ చిత్రపటానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు.
థలసేమియా బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ కిట్ లు అందించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...“మానవత్వంలో ఐక్యత” అనే ఈ ఏడాది థీమ్ సమాజంలో బాధలో ఉన్నవారితో, అవసరంలో ఉన్నవారితో ఐక్యంగా నిలబడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోందని గవర్నర్ అన్నారు. 1920 నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మానవ సేవకు అంకితభావంతో పనిచేస్తోందని, తెలంగాణలోని 33 జిల్లాల్లో వేలాది మంది సభ్యులు రక్తదానం, ఆరోగ్య శిబిరాలు, విపత్తు సహాయం, ప్రజా సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
థలసేమియాతో పోరాడుతున్న చిన్నారుల ధైర్యసాహసాలను గవర్నర్ అభినందించారు. నిరంతరం రక్త మార్పిడి అవసరమైన పరిస్థితుల్లోనూ వారు చూపుతున్న ఆత్మవిశ్వాసం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా పోరాడుతున్న అసలైన హీరోలని కొనియాడారు.
సీఎస్ఆర్ భాగస్వాముల సహకారం వల్ల గ్రామీణ ప్రాంతాలకు ఆరోగ్య సేవలు చేరుతున్నాయని, రక్తదానంపై అవగాహన పెరుగుతోందని, సహాయక చర్యలు మరింత బలోపేతమవుతున్నాయని గవర్నర్ తెలిపారు. రెడ్ క్రాస్ వాలంటీర్లు, జిల్లా అధికారులు గ్రామాల నుంచి నగరాల వరకూ సేవా స్పూర్తిని వ్యాప్తి చేస్తున్నారని ప్రశంసించారు.
మహాత్మా గాంధీ సేవా తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని, సేవను కేవలం బాధ్యతగా కాకుండా జీవితంలో అత్యున్నత విలువగా భావించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ రక్తదానం చేయాలని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
కరుణ, ఐక్యత, సేవా భావంతో సమాజాన్ని మరింత సున్నితంగా, శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు.
దేశంలో టీబీ కేసులు ఎక్కువ ఉన్న దృష్ట్యా టీబీ నివారణకు ప్రధాన మంత్రి శ్రీ మోదీజీ టీబీ ముక్త భారత్ కు పిలుపునిచ్చారనీ అన్నారు.హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిక్షయ మిత్ర లను ఏర్పాటు చేసి టీబీ అరికట్టేందుకు కృషి చేశామని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్ మాట్లాడుతూ...గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శివ ప్రతాప్ శుక్లా రెడ్ క్రాస్ సొసైటి లను బలోపేతం పై దృష్టి పెట్టారు. జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వం పెంచేందుకు మే 15 నుంచి జూన్ 15 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశి కిరణా చారి, రెడ్ క్రాస్ సొసైటి జనరల్ సెక్రటరీ, CEO శ్రీ రాములు, జిల్లాల రెడ్ క్రాస్ సొసైటి ప్రతినిధుల, NGO ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
రెడ్ క్రాస్ సొసైటి కి రూ.4 లక్షల ఆర్థిక సహాయం
రెడ్ క్రాస్ సొసైటి కి రూ.4 లక్షల ఆర్థిక సహాయంను కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అందజేసింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







