ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- May 08, 2026
హైదరాబాద్: క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్ సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో హాస్పిటల్లో “అపోలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థోపెడిక్స్”ను ప్రారంభించారు. క్రీడాకారులు, ఫిట్నెస్ అభిరుచి కలిగిన వారికి ఒకేచోట నిర్ధారణ, శస్త్రచికిత్స, పునరావాస సేవలు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ప్రారంభ కార్యక్రమంలో కేఈఐ గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ కామినేని, తెలంగాణ ప్రభుత్వ క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రన్ జన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కేంద్రాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్‌కు వైద్యసదుపాయాలను వివరించారు. ఆధునిక చికిత్స, పునరావాస సౌకర్యాలు క్రీడాకారుల కోలికకు ఎంతో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడా గాయాలకు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, చికిత్స అవసరమని తెలిపారు. లిగమెంట్ గాయాల నుంచి క్లిష్టమైన కీళ్ల సమస్యల వరకు ఆధునిక శస్త్రచికిత్సలు, శాస్త్రీయ పునరావాస విధానాలతో చికిత్స అందిస్తామని చెప్పారు.
అపోలో ఆస్పత్రుల తెలుగు రాష్ట్రాల సీఈఓ తేజస్వి రావు వీరేపల్లి మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి స్పోర్ట్స్ మెడిసిన్ సేవలను అందించడంలో ఈ కేంద్రం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్యసేవల అవసరం కూడా పెరుగుతోందన్నారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో ఆస్పత్రుల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్కరణ్ సింగ్ మాట్లాడుతూ.. బహుళ విభాగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి రోగులకు వేగవంతమైన, మెరుగైన ఫలితాలు అందించడమే లక్ష్యమన్నారు. కేంద్రంలో డాక్టర్ రవితేజ రుద్రరాజు, డాక్టర్ రమిందర్ కౌర్ తదితర నిపుణులు సేవలందించనున్నారని తెలిపారు.
పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా వుంది. అపోలో హాస్పిటల్స్ ప్రారంభించిన ఈ సెంటర్ క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత గొప్పగా అత్యాధునిక ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్ అందిస్తున్న అపోలో హాస్పిటల్స్ కు అభినందనలు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







