గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- November 24, 2026
దుబాయ్: భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ ఈ.విష్ణువర్ధన్ రెడ్డి, గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓ ఫరీద్ బెల్బౌబ్తో సమావేశమయ్యారు.షార్జా కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్టైనర్ అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్ రంగాల్లో సేవలందిస్తోంది.
ఈ సమావేశంలో గల్ఫ్టైనర్కు భారత్‌లో ఉన్న కార్యకలాపాలు, భారతీయ వ్యాపార సంస్థలకు లాజిస్టిక్స్, పోర్ట్ రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.
భారతదేశంలో గల్ఫ్టైనర్ కార్యకలాపాలను మరింత విస్తరించడంతో పాటు, భారతీయ వ్యాపార సంస్థలకు కొత్త అవకాశాలను అన్వేషించే అంశాల పై చర్చలు జరిగినట్లు సమాచారం.
భారత్–యూఏఈ మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇటువంటి సమావేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
తాజా వార్తలు
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!
- ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
- బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!
- గల్ఫ్ భద్రతకు దౌత్యం, ప్రాంతీయ సహకారం అవసరం: ఖతార్
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!







