రియోలో జిమ్నాస్టిక్ కు గాయాలు
- August 07, 2016
ఒలింపిక్స్ లో పతకం సాధించడమనేది ప్రతీ క్రీడాకారుడి కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, అక్కడ సత్తా చాటడం మరొక ఎత్తు. అందులోనూ జిమ్నాస్టిక్స్ అంటే మరింత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నంలో జిమ్నాస్ట్ లు గాయాలు బారిన పడటం అధికంగానే జరుగుతూ ఉంటుంది.తాజాగా ఈ తరహా ఘటనే రియో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. ఓ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ ఫీట్ చేసే క్రమంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. పురుషుల క్వాలిఫయింగ్ లో భాగంగా నిర్వహించిన వాల్ట్ జిమ్నాస్టిక్స్ లో సమిర్ ఎయిట్ సెడ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాక్ ఫ్లిప్స్ ను పూర్తి చేసే క్రమంలో గాలిలోకి ఎగిరి అదుపు తప్పి నేలపై పడ్డాడు. దీంతో విలవిల్లాడిపోయిన సమిర్ ను ప్రాథమిక చికిత్స చేసిన తరువాత స్ట్రైచర్ పై ఆస్పత్రికి తరలించారు. సమిర్ కిందకు పడేటప్పుడు కాలిపిక్కలోని ప్రధాన ఎముక తీవ్రంగా ఫ్రాక్చరైనట్లు డాక్టర్లు ధృవీకరించడంతో అతని ఒలింపిక్స్ కల ముగిసింది. అయితే ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమిర్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







