ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- May 09, 2026
41 మందిని అదుపులోకి తీసుకున్న బహ్రెయిన్ భద్రతా సంస్థలు
మనామా: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మరియు “విలాయత్ అల్-ఫకీహ్” భావజాలంతో సంబంధాలు ఉన్న ఓ గుంపును బహ్రెయిన్ భద్రతా సంస్థలు వెలికితీసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం, విదేశీ సంస్థల కోసం గూఢచర్యం నిర్వహించడం, ఇరాన్ దాడులకు మద్దతు ఇవ్వడం వంటి ఆరోపణలపై గతంలో నమోదైన కేసుల దర్యాప్తు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన గుంపుకు చెందిన 41 మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఇంకా అన్వేషణ, దర్యాప్తు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ గుంపుతో సంబంధాలు ఉన్నట్లు తేలిన వారిపై లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బహ్రెయిన్ అధికారులు హెచ్చరించారు.
భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు సమాచారం. ఈ ఘటన ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరింత చర్చకు దారితీసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







