ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి.భరత్ భూషణ్..
- May 10, 2026
అమరావతి: తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి.భరత్ భూషణ్ ను నియమించింది ఏపీ ప్రభుత్వం.
సినిమాల పై మక్కువతో 20 ఏళ్లుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు భరత్ భూషణ్. భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.
ఇటీవలే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ ని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







