యూఏఈలో మే 11 నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- May 10, 2026
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని పాఠశాలలు మే 11, సోమవారం నుంచి మళ్లీ ప్రత్యక్ష బోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ (MoE) అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అమలులో ఉన్న తాత్కాలిక ఆన్లైన్ తరగతుల అనంతరం విద్యార్థులు తిరిగి స్కూల్ క్యాంపస్‌లకు హాజరుకానున్నారు.
ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులతో సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రక్రియ నిరంతరంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
ఇదివరకే మే 10 సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో, “తదుపరి కాలానికి అనుసరించాల్సిన విద్యా విధానం — ప్రత్యక్ష బోధనా లేదా దూరవిద్యా విధానమా — అన్నదానిపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిర్ణయం ప్రకటిస్తాము” అని విద్యాశాఖ పేర్కొంది.
ఇక దుబాయ్‌లోని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) కూడా ఎమిరేట్‌లోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి ప్రత్యక్ష తరగతులను పునఃప్రారంభిస్తాయని ప్రకటించింది.
ఈ నిర్ణయంతో యూఏఈ వ్యాప్తంగా విద్యార్థులు మళ్లీ సాధారణ విద్యా వాతావరణంలోకి అడుగుపెట్టనున్నారు. పాఠశాలలు ఆరోగ్య, భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారాలు సూచించాయి.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







