ప్రాన్స్ డిమ్సమ్
- July 24, 2015
ప్రాన్స్ డిమ్సమ్
కావలిసిన పదార్ధాలు
రొయ్యలు - ఎనిమిది
మైదా - అరకప్పు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - ఒక స్పూను
సోయా సాస్ - అరస్పూను
మిరియాల పొడి - అరస్పూను
నువ్వుల నూనె - అరస్పూను
నువ్వులు - ఒక స్పూను
వెల్లుల్లిరెబ్బలు - ఐదు
టొమాటో - ఒకటి
నూనె - సరిపడా
ఉప్పు - సరిపడా
తయారీ విధానం
మైదాపిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసి వాటిపై ఉప్పు,కారం,అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ,సోయాసాస్, నువ్వుల నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని వాటి మధ్య ఒక రొయ్యను మసాలా మిశ్రమంతో పాటు ఉంచి, పూరీ అంచుల్ని మూసేసి డిమ్ సన్ ఆకృతిలో వచ్చేట్లు చేసి కొంచెం సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలూ,నువ్వులూ, మిరియాలపొడీ, ఎండుమిర్చీ, టొమాటో ముక్కలూ ఉప్పు వేసి వేయించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి డిమ్సమ్ల(ఆవిరిలో ఉడికించిన రొయ్యలు)ను ఈ వెల్లుల్లి మిశ్రమంతో కలిపి వడ్డిస్తే సరి. డిఫరెంట్గా రొయ్య స్నాక్స్ రెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







