జీవితానికి ఉపయోగ పడే లక్షణాలు

- July 24, 2015 , by Maagulf
జీవితానికి ఉపయోగ పడే లక్షణాలు

భగవంతుడిచ్చిన జ్ఞానం అనే విభూతి ని ఉపయోగించుకొని, తద్వారా లాభించిన అర్ధం తో తీసుకున్న పూజా ద్రవ్యాలు  దేవాలాయం లో పూజారి ద్వారా భగవంతుని కైంకర్యం కోసం ఎలా సమర్పింపబడతాయో, వృత్తి జీవనం లో ఉద్యోగిగా మన భాద్యతను నిర్వర్తిస్తూ ఆపైన మన ఎదుగుదల అనే ఆకాంక్షను మన పై అధికారి ద్వారా సంస్థ స్థాపకులకు  అలానే విన్నవించబడాలి.  

 

అయితే ఇక్కడ ఒక విశేషత వుంది. కార్య నిర్వహణ లోననైనా, లేదా మరే శాస్త్రీయ అంశాల పైనైనా  అశేష పరిజ్ఞానం ఉన్నపటికీ విధేయత అనే లక్షణం ద్వారా మనం సాధారణం గా వారధి గా వుండే వ్యక్తులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తాము. అది మన బలహీనత అని ఒకవేళ ఆ వారధి పై వుండే వ్యక్తులు కాని భావించి, మన విశ్వాసాలకు ప్రతిబంధకమైతే దానికి వారు తగిన మూల్యం చెల్లించక తప్పదు. 

 

కానీ భగవంతుడి ని నమ్మిన వాడికి , పెద్దలు చెప్పినట్లు తన జీవిత కాలం లో ఏదో ఒక సమయం లో ఒక శుభవార్త వినే అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడటం మన ధర్మం. ఆపైన పరమాత్మ నిర్ణయం.  

 

సరైన మంత్రాంగం లేని రాజు, ప్రతిభ కలిగిన మంత్రాంగపు  విలువ తెలియని వాడు, సరైన శిష్యుడు లేని గురువు, జ్ఞాన సముపార్జనకై వచ్చిన శిష్యుడికి సన్మార్గపు  భోధన చేయలేని గురువు ఇద్దరు చరిత్ర పుటలలో చీకటి అధ్యాయలకే పరిమితమయ్యారు. 

 

ఉదాహరణకు: ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు,  శుక్రాచార్యుడు   

ఏది ఏమైనా  మనం మంచిగా ఎదుగుతూనే, మన ఎదుగుదలకు సహకిరించిన వారికీ చేయూత నివ్వడం సరైన ధర్మం.

అపాత్రాదానం ఎన్నడూ అనుసరణీయం కాదు. పాత్రత తెలుసుకుని తోడ్పడిన నాడు ప్రాజ్ఞుడనబడును    

ఇతిహాసాలు, పురాణాలు ఈ విషయాన్ని స్పష్టం గా తెలియజేస్తున్నాయి కూడా ! 

 

ధర్మో రక్షతి రక్షితః  

--సుబ్రహ్మణ్య శర్మ(దుబాయ్)  

                             

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com