జీవిత ఖైదు అనుభవిస్తున్నా ఖైదీ పరారీ..
- August 07, 2016
చర్లపల్లి ఓపెన్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. ఆ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఉదయం జైలు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలులోని ఖైదీల సంఖ్య 104 కి బదులు 103 మందే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన జైలు ఉన్నతాధికారులు పరారైన ఖైదీని గుర్తించారు.మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మంచాపూర్ గ్రామానికి చెందిన గోవర్దన్ గా పోలీసులు గుర్తించారు. అతడి కోసం జైలు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ అంశాన్ని జైలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. పరారైన గోవర్దన్ చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడని సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







