'2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభo...
- August 07, 2016
శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం '2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభమయింది. 'రోబో' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దాని సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ సరసన ఎమిజాక్సన్ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ కనిపించనున్నారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నట్లు, అందులో అక్షయ్‌కుమార్ కనిపించేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మరోవైపు ప్రతినాయకుడిగా అక్షయ్‌కుమార్ రూపం ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొనలేదు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మినహాయించి ఇతర నటీనటులపై మాత్రం చిత్రీకరించారు. యాభై శాతం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు శంకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అమెరికాలో విశ్రాంతి తీసుకుని గత వారం చెన్నై వచ్చారు. మళ్లీ '2.ఓ' చిత్రీకరణ మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం చెన్నైలోని అయనావరంలో చిత్రీకరణ కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరుకు ప్రజలు వినతులు సమర్పించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులోనూ రజనీకాంత్ పాల్గొనలేదు. ఆ ప్రాంతానికి రజనీ అభిమానులు, స్థానికులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అయనావరం పోర్చీస్ రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







