భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- May 13, 2026
హైదరాబాద్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (బీఎస్‌జీ) తెలంగాణ రాష్ట్ర బృందం బుధవారం రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్, బీఎస్‌జీ చీఫ్ పేట్రన్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి రాష్ట్రంలో సంస్థ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వివరించింది.
ప్రతినిధి బృందానికి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, బీఎస్‌జీ రాష్ట్ర ప్రధాన కమిషనర్ ఎం. దాన కిశోర్ నేతృత్వంలో, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, బీఎస్‌జీ రాష్ట్ర కార్యదర్శి డా.ఈ.నవీన్ నికోలస్ పాటు ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాల్లో స్కౌటింగ్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది.బీఎస్‌జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులు, గవర్నర్ ఫండ్స్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని ఎం. దాన కిషోర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 బీఎస్‌జీ యూనిట్లు పనిచేస్తుండగా, 30 వేల మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని చెప్పారు.
ప్రభుత్వం నుంచి బీఎస్‌జీ కార్యకలాపాలకు నిరంతర ఆర్థిక సహకారం అందుతోందని డా. ఈ. నవీన్ నికోలస్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో వెయ్యి పాఠశాలలను బీఎస్‌జీలో చేర్చామని, 2026-27లో మరో వెయ్యి పాఠశాలలను చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో బీఎస్‌జీ యూనిట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
బీఎస్‌జీ తెలంగాణ సాధించిన పురోగతిని అభినందించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలను కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు.
రాష్ట్ర శిక్షణా కేంద్రంలో ఉన్న సదుపాయాలు యువ స్కౌట్స్‌లో నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రాంతానికి స్కౌటింగ్ కార్యక్రమాలను విస్తరించేందుకు కట్టుబడి పనిచేస్తామని బీఎస్‌జీ తెలంగాణ ప్రతినిధులు గవర్నర్‌కు హామీ ఇచ్చారు.
రామదాసు కీర్తనలు సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన గవర్నర్
సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నూతనంగా ప్రవేశపెట్టిన భక్త రామదాసు కీర్తనలు ఒక సంవత్సరం ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు–2026ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా బుధవారం లోక్ భవన్లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.దాన కిషోర్, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి.నిత్యానంద రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్‌లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!









